|
హైదరాబాద్ సిటీ పోలీసు చరిత్ర |
నిజాం నవాబు కాలంలో పోలీసు వ్యవస్థ |
 |
పూర్వం నిజాం నవాబు
ఏలుబడిలోని నైజాం రాజ్యంలో
అంతర్భాగాలుగా ప్రస్తుత
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని
తెలంగాణ ప్రాంతం, కర్నాటక
రాష్ట్రంలోని బీదర్, రాయచూర్
,
గుల్బర్గా జిల్లాలు,
మహారాష్ట్రలోని ఉస్మానాబాద్,
బీడ్, లాతూర్, ఔరంగాబాద్
,
పర్బణి జిల్లాలతో కూడిన
పెద్ద రాజ్యం
ఉండేది. ఇది దాదాపు దక్కను
పీఠభూమి అంతటా వ్యాపించి
ఉండేది. ఇంతటి భారీ
రాజ్యానికి హైదరాబాద్ నగరం
రాజధానిగా విలసిల్లుతుండేది.
అందుబాటులో ఉన్న రికార్డులను
అనుసరించి క్రీ.శ. 1847
సంవత్సరం నుంచి హైదరాబాద్
నగరంలో పోలీసింగ్ పోలీసు
కమిషనరేట్ వ్యవస్థ ద్వారా
నిర్వహింపబడుతుండే దని,
అప్పట్లో హైదబారాబాద్ సివిల్
సర్వీసులో పనిచేసే అధికారుల
నుంచి తన నమ్మకాన్ని
చూరగొన్న, సమర్థులైన వారినే
నగర పోలీసు కమిషనర్‌గా నిజాం
నియమించేవాడు. వీరు
హైదరాబాద్ నగరంలో పోలీసింగ్
పైననే గాక ఇతర అనేక విషయాలపై
ప్రత్యక్ష బాధ్యతలతో నేరుగా
నిజాం నవాబుకే జవాబు-దారీగా
ఉండేవారు. పోలీసు కమిషనర్
విధులు, విధానాలన్నీకూడా
హోంశాఖ నిర్దేశించేది..
పోలీసు కమిషర్ ను ‘కొత్వాల్’
అనే గౌరవవాచకంతో
సంబోధించేవారు. నగరంలో శాంతి
భధ్రతలను సక్రమంగా
నిర్వహించడం, నేరాల అదుపు,
నివారణ చర్యలను చేపట్టడం ఈయన
ప్రధాన బాధ్యతలుగా ఉండేవి.
వీరు తమ అధికార నిర్వహణలో
భాషా మాధ్యమంగా కేవలం
ఉర్దూను మాత్రమే
ఉపయోగించేవారు. నగరంలో
‘కొత్వాల్’
అతి పెద్ద అధికారిగా నగర
ప్రజలచే ,
ప్రముఖులచే గౌరవింపబడేవారు
ఈయన తన పోలీసు విభాగంలో
సాధారణ పోలీసులనే కాక వివిధ
దేశాలకు చెందిన వివిధరంగాల
నిపుణులైన వ్యక్తులను
గూఢచారులు గానూ ,
నేర నియంత్రణకు
వినియోగించుకొనేవారు. ఈ
విధంగా నగర పోలీసు వ్యవస్థలో
‘పబ్లిక్
ఫోర్స్’
కూడా అంతర్భాగంగా
కొనసాగుతుండేవి
|
 |
కొత్వాల్ హైదరాబాద్ నగరంలోని
పోలీసులకు సంబంధించిన
అధికారాలను మాత్రమే కాక అనేక
ఇతర సివిల్ అధికారాలను కూడా
చలాయించే వారు. ఈయనకు రాజు
గారి తోనూ ,
రాజాస్థానంలోని ముఖ్యమైన
మంత్రులు, అధికారులతో
ప్రత్యక్ష సంభంధాలుండేవి.
ఈయన శాంతి భధ్రతల నిర్వహణ,
నేరాలను కనిపెట్టుట ,
అదుపుచేయుట, నేరస్తులపై న్యాయ
విచారణ జరుపుటలో రాజుకు
ప్రధాన సలహాదారునిగా
ఉండేవారు. ఈ విధంగా
నేరనిరోధక న్యాయవ్యవస్థ
(క్రిమినల్ జస్టిస్ సిస్టమ్)
నిర్వహణలో ప్రధాన పాత్ర
పోషించడమే గాక, రాజ దర్బారులో
అత్యంత గౌరవ మర్యాదలతో కూడిన
స్థానంలో ఉండేవారు. ఈయన
విధినిర్వహణలో భాగంగా
‘ధానేదార్ల’
నుంచి ‘రోజ్‌నామ
బాస్’
(దినసరి నివేదికలు) ద్వారా
నగరంలో ప్రతి దినం ఏమి
జరుగుచున్నది,
శాంతి భధ్రతలు, నేరనిరోధక
వ్యవస్థ పని తీరు ఎలా ఉంది.
అనే విషయాలను తెలుసుకొనేవారు.
ఈ విషయాలతో పాటు నగరంలో
బ్రిటీషు వారి కదలికపై కూడా
నిఘా ఉంచి వీటి గురించి నిజాం
నవాబుకు ఎప్పటికప్పుడు
సమాచారం అందించేవారు.. ఈ
నిఘా వ్యవస్థ ,
సమాచార సేకరణకు వివిధరకాల
వ్యవస్థలలోని వ్యక్తులకు
నజరానాలు ,
రహస్య జీతాలను అందజేస్తూ
నగరంలోని అనుమానాస్పద విషయాలు,
అనుమనాస్పద వ్యక్తుల కదలికలపై
డేగ కన్నుతో గూఢచార వ్యవస్థను
నిర్వహించేవారు. ఈ విధంగా
నగరంలో అతి ముఖ్యమైన
అధికారిగా ఉండే ‘కొత్వాల్-ఎ-బల్దా’
పట్ల నగర ప్రజలు భయ
భక్తులతోనే గాక అపార
గౌరవాభిమానాన్ని
కల్గియుండేవారు. నవాబ్ మీర్
ఉస్మాన్ అలి ఖాన్, నిజాం-VII
పరిపాలనలో చివరి శక్తిమంతమైన
‘కొత్వాల్’
గా రాజ బహద్దూర్ వెంకట్రామా
రెడ్డి పేర్గాంచారు. ఇతను
గద్వాల్ ,
వనపర్తి సంస్థానాల మధ్య
ఏర్పడిన భారీ వివాదాలను చిన్న
చిన్న పట్టు విడుపులతో
సమర్థంగా పరిష్కరించారు. అతి
భారీ భూకమతాలను లేదా వ్యవసాయ
భూములను కల్గిన పెద్ద పెద్ద
ప్యూడల్ ప్రభువులచే ఇటు వంటి
భారీ సంస్థానాలు
పాలించబడుతుండేవి. వీరు తమ
సంస్థానాలలో రక్షణకు,శాంతి
భధ్రతల పరిరక్షణకు అవసర మైన
పోలీసు దళాలను ,
ప్రత్యేక మైన న్యాయ వ్యవస్థను
ఏర్పాటు చేసుకొని,
నిర్వహించుకొనేవారు. |
 |
థానా(పోలీసు స్టేషన్)
అధికారిని ‘అమీన్’
అని, ఇన్‌స్పెక్టర్ హోదాగల
అదికారిని ‘సదర్
అమీన్’
అని పిలిచేవారు, అసిస్టెంట్
కమిషనర్ ఆఫ్ పోలీసు ,
డిప్యూటి కమిషనర్లను ‘మదద్గార్
కొత్వాల్’
,
‘నయిబ్
కొత్వాల్’
అని పిలిచేవారు. మొత్తం సిటి
పోలీసు విభాగానికంతటికీ
ప్రత్యేకమైన యూనిఫాం
,
బ్యాడ్జ్‌లుండేవి. ధానాలో
‘జమేదార్’
(జనరల్ డ్యూటీ హెడ్
కానిస్టేబుల్) ,
ఒక ‘మొహ్రిరి’
(రైటర్ హెడ్‌కానిస్టేబుల్)
ఉంటారు. కానిస్టేబుళ్ళను
మొదట్లో ‘బర్కందాజ్’
అని తరువాత ‘జవాన్’
అని పిలిచేవారు. క్రీ.శ.
1902 లో రూ. 6/-
నెలసరి జీతంగానూ ,
2 అణాలను సిటీ వెలుపలికి
వెళ్ళినపుడు రోజువారి
అలవెన్సుగాను పొందేవారు. |
 |
దివానీ అదాలత్ (సివిల్
కోర్టులు) ,
ఫౌజ్‌దారి అదాలత్‌లు
(క్రిమినల్ కోర్టులు) గా
నగరంలో న్యాయవ్యవస్థ
కొనసాగేది. వీటికి సంబంధించి
వివిధ స్థాయిలలో
న్యాయాధికారులు నియమితులయ్యే
వారు. ఇవి నగరంలో ఒరిజినల్
,
అప్పీలేట్ జ్యూరీస్‌డిక్షన్
కల్గియుండేవి. కిందిస్థాయిలో
సివిల్ ,
క్రిమినల్ కోర్టులు మున్సిఫ్
మెజిస్ట్రేట్‌లు ఫస్ట్ క్లాస్
నేర విచారణ హక్కులు
కల్గియుండి అన్నితాలూకా
హెడ్‌క్వార్టర్‌లలో ఉండేవి.
|
 |
ప్రాసిక్యూషన్ వ్యవస్థ నగర
పరిధిలో ఇన్‌స్పెక్టర్
ర్యాంకు అధికారులచే
నిర్వహించబడేది. వీరంతా
‘నయిబ్
కొత్వాల్ సెగ్హల్ జెరైమ్’
అనగా డిప్యూటీ కమిషనర్ ఆఫ్
పోలీస్ ( క్రైమ్స్)
ఆధ్వర్యంలో పనిచేసే వారు.
గత శతాబ్దం ఆరంభంలో హైదరాబాద్
నగర జనాభా 2.5 లక్షలుండేవి.
వీరి రక్షణ ,
శాంతి భధ్రతలను కాపాడటానికి
కేవలం కొన్నివేలమంది
పోలీసులతో నగర పోలీసు వ్యవస్థ
తీర్చిదిద్ది హైదరాబాద్ నగరం
చుట్టూ పెట్టని కోటలా కాపలా
కాస్తుండేవారు హైదరాబాద్ నగరం
చుట్టూ ఉన్న కోటకు 13 పెద్ద
పెద్ద ద్వారాలు ,
లెక్క లేనన్ని
కిటికీలుండేవి. పోలీసు
కమిషనర్ గారి ఉత్తర్వు మేరకు
వీటిని ఉదయం తెరచి తిరిగి
రాత్రి వేళల్లో మూసి
ఉంచేవారు. ఈ పద్దతి వల్ల
‘ఆటో
మేటిక్ నాకా బందీలా’
నేర నిరోధానికి దోహదపడేది.
ఎవరైనా దొంగలు నగరంలోకి
ప్రవేశించడానికి దుస్సాధ్యంగా
ఉంటూ, ఒక వేళ ప్రవేశించినా
దొంగిలించిన సొమ్ముతో
నగరాన్ని దాటి వెళ్ళే
పరిస్థితి లేక పోలీసులకు
చిక్కి కటకటాలపాలయ్యేవారు.
క్రీ.శ1906 సం|| లో సిటీ
పోలీసు బడ్జెట్ మహా అంటే
కొన్ని లక్షలుండేది. పోలీసు
స్టేషన్లకు ధానా అని అవుట్
పోస్ట్‌లకు ‘నాకా’
అనే బిల్డింగ్‌లుండేవి.
ఇవికాక వీటి నిర్వహణకు కొన్ని
పరిపాలనా సంబంధమైన
భవంతులుండేవి. ప్రస్తుతం
పోలీసు కమిషనర్ ఇప్పటి ఓల్డ్
సిటీలో అప్పుడు నగరానికే తల
మానికమైన ప్రదేశంలో గల 100
సం|| పై గా చరిత్రగల పురానీ
హవేలిని అధికార నిర్వహణకు
ఉపయోగించేవారు. అప్పుడు ఎటు
వంటి మోటారు వాహనాలు,
వైర్‌లెస్‌లు ,
టెలిఫోన్ సౌకర్యాలుండేవి
కావు. కానీ పోలీస్ స్టేషన్
స్థాయిలో అనేక రికార్డులను
ఉర్దూలో నిర్వహిస్తుండే వారు
వీరికి కొన్ని తుపాకులు
,
సంకెళ్ళు( హాండ్ కప్స్)
,
ఇనుప గొలుసులు (లెగ్ విరన్స్)
అందుబాటులో ఉండేవి. పౌరుల
వ్యక్తిగత స్వేఛ్చనే పెద్దగా
పరిగణనలోకి తీసుకొనేవారు
కాదు. అటువంటప్పుడు నేరస్థుల
పట్ల పోలీసులవైఖరి అత్యంత
కర్కశంగా ఉండేదనివేరేగా
చెప్పనక్కర్లేదు.
నేరస్థులపైన నిఘా ,
‘గూండాలు’
రౌడీల పట్ల సునిశిత
పర్యవేక్షణ ఉండేది. మత పరమైన
ఊరేగింపులు ,
సమావేశాలకు,కార్మికులులేదా
విద్యార్థుల అలజడులు సమస్యలను
పరిష్కరించడం కూడా వీరి విధి
నిర్వహణలో భాగంగా ఉండేది.
ప్రభుత్వోద్యోగుల సమ్మెలు
ఎక్కడా
మచ్చుకు కూడా కన్పించేవి
కాదు. రాజకీయ పార్టీల
నిరసనలు కూడా నామమాత్రంగా
ఉండేవి. |
 |
1271 పస్లీలో కమిషనర్
ఆధ్వర్యంలోని మొత్తం పోలీసు
ఫోర్సులో అరబ్బులు, సిక్కులు,
బర్కందాజ్‌లు
,
హర్కరాలు అందరూ కలిపి 1524
మంది
,
136 మంది అశ్వకదళం (మౌంటెడ్
పోలీసు) ఉండేది వీటి నిర్వహణ
కొరకు రు.82,364/-
కేటాయించేవారు.. |
 |
1294 పస్లీలో డిటెక్టీవ్
పోలీసు ఫోర్సును కొత్తగా
తీసుకొచ్చారు. అప్పటి సిటీ
పోలీసు వ్యవస్థలో కమిషనర్
కింద ముగ్గురు , సీనియర్
అధికారులు, ఇద్దరు
ముహతమిమ్స్, 10 సదర్
అమిన్‌లు, 27 మంది అమిన్‌లు,
౩ నయిబ్ అమిన్‌లు, 49 మంది
సోర్యార్‌లు , 2830 అన్ని
ర్యాంకులు కలిపిన
కానిస్టేబుల్స్ 128 మంది
అరబ్బులు, ,
64 మంది ఇతరత్రా వ్యక్తులు
ఉండేవారు. ఇది 1337 పస్లీ
వచ్చేటప్పటికి ఈ సిటీ పోలీసు
ఫోర్స్ 3434 కు పెరిగింది.
అవినీతికి సంబంధించిన కేసులు
చాలా స్వల్పం. ఈ
పోలీసువ్యవస్థను నిర్వహించిన
పోలీసు కమిషనర్లందరిలోకి
రాజాబహద్దూర్
వెంకట్రామారెడ్డి ప్రత్యేక
స్థానాన్ని అలంకరించారు. ఈయన
దాదాపు 14 సం|| పాటు ఈ పదవిలో
కొనసాగి చరిత్ర
సృష్ఠించడమేగాక, తన అపూర్వ
పరిపాలనా దక్షతతో ప్రజల
,
నిజాం ప్రభువుల మన్ననలు
,
గౌరవాభిమానాలను చూరగొన్నారు.
|
|
top |
|
పురాతన కమిషనర్ ఆఫ్ పోలీసు ఆఫీసు భవనం
చరిత్ర. |
|
ప్రస్తుత పురానీ
హవేలిలోని
కమిషనర్
కార్యాలయం
భవంతిని
హైదరాబాద్ రాజ్య
ప్రధాన మంత్రి
అయిన సర్ సాలార్
జంగ్ డొనేట్
చేశారు. |
|
1955సంవత్సరంలో హైదరాబాద్ సిటీ పోలీస్
పునర్వవస్తీకరణ |
|
హైదరాబాద్
ప్రభుత్వం జారీ
చేసిన
ఉత్తర్వులననుసరించి
మద్రాస్ సిటీ
పోలీస్ వ్యవస్థను
ఆధారంగా చేసుకొని
హైదరాబాద్ సిటీ
పోలీసు
వ్యవస్థను
పునర్‌వ్యవస్తీకరించారు.
ఇది 15-07-1955
నుంచి అమల్లోకి
వచ్చింది.
దీనిననుసరించి
పోలీసుల విధులను
లా ఆండ్ ఆర్డర్
,
క్రైం విభాగాలుగా
విడగొడుతూ
హైదరాబాద్
మునిసిపల్ పరిధి
మొత్తం సిటీ
పోలీసు కిందకు
తీసుకు వచ్చారు.
ఈ
పునర్‌వ్యవస్థీకరణలో
భాగంగా హైదరాబాద్
జిల్లా ,
రైల్వే పోలీసులో
కొంత భాగాన్ని
కూడా
July, 15th -1955
నుంచి దీని
కిందకు
తీసుకొచ్చారు.
|
|
ప్రధానాంశాలు. |
 |
పునర్‌వ్యవస్తీకరణకు ముందు
పరిపాలనా సంబంధమైన విషయాలకు
సర్కిల్ వేదికగా ఉండేది. ఆ
సర్కిల్ పరిధిలోని పోలీసు
స్టేషన్లకు అవసరమైన
సిబ్బందిని కేటాయించిన తరువాత
మిగిలిన సిబ్బందిని సర్కిల్
ఇన్‌స్పెక్టర్ కార్యాలయంలో
అందుబాటులో పెట్టేవారు. ఈ
సిబ్బందిని సర్కిల్
ఇన్‌స్పెక్టర్లు బందోబస్తులు
,
రాత్రి వేళల్లో గస్తీకి
వినియోగించుకొనే వారు.
పునర్‌వ్యవస్తీకరణ ననుసరించి
ప్రతి పోలీసు స్టేషన్‌కు
నిర్దిష్ట సంఖ్యలో సిబ్బందిని
కేటాయించేవారు. |
 |
కర్నూలు రాజధానిగా
ఆంద్రప్రదేశ్ రాష్ట్రం 01-11.1956
సం||లో ఆవిర్భవించింది. ఆ
తరువాత రాజధానిని హైదరాబాద్
నగరానికి మార్చారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర
ఆవిర్భావంతో ఉత్పన్నమయిన
పరిస్థితులను బట్టి హైదరాబాద్
,
సికింద్రాబాద్ జంట నగరాలుఎంతో
ప్రాముఖ్యాన్ని
సంతరించుకొన్నాయి. దీనితో
పాటే ఇక్కడ శాంతి భధ్రతలు,
నేర నియంత్రణ మొదలైన పనులు
ముందున్నటువంటి వ్యవస్థ
ద్వారా నిర్వహించడం కష్ట
సాద్యమైన పని అని భావించి
హైదరాబాద్ సిటీ పోలీసు
వ్యవస్థను
GO MSNo.
1620 Home(pol-b) department
dated 11-10-1957
న తిరిగి
పునర్‌వ్యవస్తీకరించారు.
దీని ద్వారా లా ఆండ్
ఆర్డర్,క్రైమ్, ట్రాఫిక్
,
స్పెషల్ బ్రాంచ్
మొదలైనవాటితో హైదరాబాద్
నగరంలోపోలీసింగ్ కష్టాలను
గట్టెక్కించే
ప్రయత్నంచేశారు. |
 |
సిటీని మొత్తం నాలుగు
ACPs
డివిజన్లుగా, 12
సర్కిల్స్‌గా, 34 పోలీసు
స్టేషన్లగా విభజిస్తూ ఇవన్నీ
DCP
లా ఆండ్ ఆర్డర్ పర్యవేక్షణలో
పనిచేసే విధంగా ఏర్పాటు
చేశారు. |
 |
ACP
తన డినిజన్‌లో లా అండ్ ఆర్డర్
క్రైం ,
శాంతి భధ్రతల పర్యవేక్షణ
రెండింటినీ నిర్వహించవలసి
ఉంటుంది.
L&O
ఎస్ఐ పోలీసు స్టేషన్
ఇన్‌ఛార్జిగా ఉంటూ ఆస్టేషన్
పరిపాలన పరమైన నిర్వహణ
,
దాని పరిధిలో శాంతి భధ్రతల
పరి రక్షణ చూస్తుండేవాడు.
క్రైం ఎస్ఐ ఆ పోలీస్ స్టేషన్
పరిధిలోని క్రైం వర్క్ కు
ఇన్‌ఛార్జిగా ఉంటారు. |
 |
DCPల
పర్యవేక్షణలో నిర్వహించే ఇతర
శాఖలు అనగా హెడ్ క్వార్టర్స్,
ట్రాఫిక్, సిటి స్పెషల్
బ్రాంచ్ మొదలగు విభాగాలన్నీ
పోలీసు కమిషనర్ పరిధిలో
కొనసాగేవి.. |
|
|
top |
1981లో సిటీ పోలీసు పునర్‌వ్యవస్థీకరణ. |
 |
హైదరాబాద్ నగరంలో విపరీతంగా
జనాభా పెరిగి పోవడం ,
నగరం వేగంగా
పారిశ్రామికీకరణం, నగరీకరణం
చెందుతుండటంలో నేరాలలో కూడా
అదే విధమైన పెరుగుదల
సంభవించింది దీన్ని దృష్టిలో
పెట్టుకొని
GO.MS No.341
Home(pol.D) Department dated
30.5.1981
ద్వారా 1981 సం|| తిరిగి
హైదరాబాద్ సిటీ పోలీసు
వ్యవస్థను
పునర్వ్యవస్థీకరించారు.
|
 |
దీని ననుసరించి నగరాన్ని 4
జోన్‌లు గా విభజించారు. అవి
హైదరాబాద్ దక్షిణం, హైదరాబాద్
తూర్పు, హైదరాబాద్ పడమర
,
హైదరాబాద్ ఉత్తరం ప్రతి
జోన్‌కు సూపరింటెండెంట్ ఆఫ్
పోలీసు ర్యాంకులో డిసిపి
ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరిస్తారు
వీరు ఆ జోన్ పరిధిలోని లా
ఆండ్ ఆర్డర్ ,
క్రైం విభాగాలను
పర్యవేక్షించడమేగాక తన
సిబ్బందిలో ఆత్మస్థైర్యాన్ని
నింపుతూ చేయవలసిన పని పట్ల
నిబద్ధతను పెంపొందించేందుకు
కృషి చేస్తారు. వీరంతా
కమిషనర్ ఆఫ్ పోలీసు ప్రత్యక్ష
పరిపాలనా వ్యవస్థలో
భాగస్వాములై ఉంటూ అదనపు
జిల్లా మెజిస్ట్రేట్
అధికారాలను కలిగి ఉంటారు.
|
 |
ఈ జోన్లన్నింటిని తిరిగి 12
డివిజన్లుగా విభజించారు.
ప్రతి డివిజన్ డిప్యూటి
సూపరింటెండెంట్ ఆఫ్ ఫోలీసు
ర్యాంకు కల్గిన ఏసిపి
పర్యవేక్షిస్తారు. ఈ
డివిజనల్ ఏసిపిలు సంబంధిత
జోన్ డిసిపి పర్య వేక్షణలో
పని చేస్తారు. ఈ ఏసిపి తమ
డివిజన్‌లో శాంతి భధ్రతలు
నెలకొల్పడం, నేరాలను
నిరోధించడం,
కేసుల మిస్టరీలను ఛేదించడం,
సిబ్బంది క్రమ శిక్షణతో ఉండే
లా చూడటం వీరిముఖ్యమైన
విధులు. |
 |
ప్రతి పోలీసు స్టేషన్‌కు ఇన్
స్పెక్టర్ ఆఫ్ పోలీస్
ఇన్‌ఛార్జ్‌గా ఉంటూ స్టేషన్
హౌస్ ఆఫీసర్‌గా పని చేస్తూ
SHO
లకు సంబంధించిన ఉద్యోగ
బాధ్యతలన్నింటినీ
నిర్వర్తించవలసి ఉంటుంది. |
 |
సిటీ క్రైం స్టేషన్ కు మరో
పేరే డిటెక్టీవ్
డిపార్ట్‌మెంట్ ఇది
DCP crimes/డిసిపి
క్రైమ్స్ ఆధ్వర్యంలో పని
చేస్తుంది. దీనికి స్టేషన్
హౌస్ ఆఫీసర్ గా ఏకంగా డిసిపి
క్రైమ్స్ తన విధులను ఏసిపిలు
,
ఇన్‌స్పెక్టర్ల సహకారంతో
నిర్వహిస్తారు. |
 |
హైదరాబాద్ సిటీ పోలీస్
విభాగానికి ప్రభుత్వం 1993
సం|| లో 3 జాయింట్ కమిషనర్లను
ఏర్పాటు చేసింది. వీరు
డిప్యూటి ఇన్‌స్పెక్టర్ జనరల్
ర్యాంకును కల్గిఉండి
ఒక్కొక్కరు విడివిడిగా కో
ఆర్డినేషన్, క్రైమ్స్
,
సెక్యూరిటిలకు బాధ్యత వహిస్తూ
సిటీ పోలీసు వ్యవస్థను మరింత
ఉత్తేజపూరితంగా పని చేయించ
డానికి ,
ఇంకా మెరుగైన పరిపాలనా
సౌలభ్యాన్ని కల్పించడానికై
కమిషనర్ ఆఫ్ పోలీస్‌కు తమ
సేవలద్వారా సహాయ
సహకారాలందిస్తుంటారు. |
 |
పోలీసు స్టేషన్ నందు ఒక సబ్
ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీసు లా
ఆండ్ ఆర్డర్ మరొక ఎస్ఐ క్రైం
విధులను నిర్వరిస్తుంటారు.
ప్రతి డివిజన్‌కు ఒక డివిజనల్
డిటెక్టివ్ ఇన్ స్పెక్టర్‌ను
ఇవ్వడమైనది. వ్యవస్థ పని
తీరును మరింత మెరుగు
పర్చడానికై సబ్
ఇన్‌స్పెక్టర్‌లు,
హెడ్ కానిస్టేబుల్ పోస్టులు
మరింతగా పెంచుతూ ,
కానిస్టేబుల్ పోస్టులను
తగ్గించడానికై ప్రణాళికలు
పంపారు. |
|
|
top |
|
ప్రస్తుత హైదరాబాద్ నగర
పోలీసు కమిషనర్‌గా
శ్రీ.బి.ప్రసాద రావు, ఐపిఎస్,
58వ కమిషనర్ ఆఫ్ పోలీస్
హైదరాబాద్ సిటీగా పదవీ
బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు
 |
|
1847 సం|| నుంచి హైదబారాద్ సిటీ పోలీస్
కమిషనర్లుగా పనిచేసిన అధికారుల పేర్లు,
పదవీ కాలం వివరాలు....
 |
|
వరుస
సంఖ్య |
పేరు |
బాద్యతలు
స్వీకరించిన
తారీఖు
(డేట్). |
-
|
శ్రీ.మహమ్మద్
వజీర్ జమదార్ |
8,డిసెంబర్
1847 |
-
|
శ్రీ.ఫజ్జూద్దీన్
ఖాన్ |
5 అక్టోబర్,
1851 |
-
|
శ్రీ మహ్మద్
సయూద్
హుస్సేని |
5, జనవరి
1853 |
-
|
శ్రీ.నవాబ్
గాలిబ్
–
ఉద్-
దౌలా |
10 నవంబర్
1853 |
-
|
శ్రీ.గ్రాండ్
సన్ ఆఫ్
జాఫర్-
ఉద్-
దౌలా |
9 ,మే 1855 |
-
|
శ్రీ.నవాబ్
జౌరవార్ జంగ్ |
6 ,జూన్ 1873 |
-
|
శ్రీ.ఇనాయత్
హుస్సేన్
ఖాన్ |
23 ఏప్రిల్
1874 |
-
|
శ్రీ.నవాబ్
అక్బర్-ఉల్-ముల్క్ |
5 మే 1884 |
-
|
శ్రీ.వజీర్
అలీ నవాబ్
(సుల్తాన్
యూవర్ జంగ్) |
8 ఏప్రిల్
1905 |
-
|
శ్రీ.కె.బి.అబ్దుల్
ఖాసిం లాల్
ఖాన్ |
25 ఏప్రిల్
1912 |
-
|
శ్రీ.మీర్
ముబారక్ అలీ
ఖాన్ |
17
సెప్టెంబర్
1912 |
-
|
శ్రీ.నవాబ్
ఎమద్ జంగ్
II |
8 నవంబర్1912 |
-
|
శ్రీ రాజా
బహద్దూర్
వెంకట్ రామా
రెడ్డి |
23 మార్చి
1920 |
-
|
శ్రీ.నవాబ్
రహమత్ యార్
జంగ్ బహదూర్ |
1 జూలై 1934 |
-
|
శ్రీ.ఎస్.ఎన్.రెడ్డి,
యం.ఎ |
21 మార్చి
1949 |
-
|
శ్రీ.నవాబ్
దీన్‌యార్
జంగ్ బహదూర్ |
6 జూన్ 1945 |
-
|
శ్రీ.రుస్తుంజీ
షాపూర్ జీ |
1 ఆగష్టు
1947 |
-
|
శ్రీ.శివ్
కుమార్ లాల్
,ఐపిఎస్ |
1 సెప్టెంబర్
1951 |
-
|
శ్రీ.ఎ.సుందరం
పిళ్ళై,
ఐపిఎస్ |
1 జూలై 1953 |
-
|
శ్రీ.బి.ఎల్.ఖాదర్.ఐపిఎస్ |
1 మే 1954 |
-
|
శ్రీ.సి.రంగస్వామి
అయ్యంగార్,
ఐపిఎస్ |
26
సెప్టెంబర్
1954 మరల
14 జూలై 1962 |
-
|
శ్రీ. ఎస్.
విజయ రంగం,
ఐపిఎస్ |
19, మే 1957 |
-
|
శ్రీ.వి.ఎన్.కాలియా
రావ్, ఐపిఎస్ |
14, మే 1959
మరల
22, మే 1967 |
-
|
శ్రీ.ఎస్.పి.సతూర్,
ఐపిఎస్ |
3,ఏప్రిల్
1961 మరల
19, ఫిబ్రవరి
1963 |
-
|
శ్రీ.ప్రహ్లాద్
సింగ్,
ఐపిఎస్ |
1,
సెప్టెంబర్
1964 |
-
|
శ్రీ.అబ్దుల్
సలామ్ ఖాన్,
ఐపిఎస్ |
1, ఫిబ్రవరి
1970 |
-
|
శ్రీ.పి.వి.జి.క్రిష్ణమాచార్యులు,
ఐపిఎస్ |
14, జూలై
1973 మరల
11 , జూన్
1976 |
-
|
శ్రీ.కె.ఎన్.
శ్రీనివాసన్,ఐపిఎస్ |
15,డిసెంబర్
1975 మరల
9 జులై 1976 |
-
|
శ్రీ.యం.ఎ.షఫియుల్లా
ఖాన్, ఐపిఎస్ |
23 ఆగష్టు
1976 |
-
|
శ్రీ.ముని
స్వామి,
ఐపిఎస్ |
28,డిసెంబర్
1977 |
-
|
శ్రీ.పి.వి.పవిత్రన్,
ఐపిఎస్ |
22,ఏప్రిల్
1978 |
-
|
శ్రీ.సి.జి.సల్దానా,
ఐపిఎస్ |
2 మే, 1981 |
-
|
శ్రీ.పి.పొన్నయ్య,
ఐపిఎస్ |
27 ఆగష్టు
1981 |
-
|
శ్రీ.ఎన్.చంద్రశేఖరన్,ఐపిఎస్ |
10,నవంబర్
1982 |
-
|
శ్రీ.విజయరామారావు,
ఐపిఎస్ |
14, ఏప్రిల్
1983 మరల
7 ఏప్రిల్
1989 |
-
|
శ్రీ.ఆర్.ప్రభాకర్
రావు, ఐపిఎస్ |
28 ఆగష్టు,
1984 |
-
|
శ్రీ.టి.సూర్యనారాయణ
రావు, ఐపిఎస్ |
5, మార్చి
1986 |
-
|
శ్రీ.వి.అప్పారావు,
ఐపిఎస్ |
15 ఫిబ్రవరి
1989 మరల
25, డిసెంబర్
1994 |
-
|
శ్రీ.వి.పుల్లన్న,
ఐపిఎస్ |
5,మే 1990 |
-
|
శ్రీ.ఎస్.వి.నరసింహులు,
ఐపిఎస్
(ఇన్‌చార్జ్
సి.పి)
అడిషనల్
సి.పి. |
6 జూలై1990 |
-
|
శ్రీ.గుర్నాథ
రావు, ఐపిఎస్ |
16, ఆగష్టు
1990 |
-
|
శ్రీ.ఎమ్.వి.భాస్కర
రావు, ఐపిఎస్ |
29, నవంబర్
1990 |
-
|
శ్రీ.హెచ్.జె.దొర,ఐపిఎస్ |
16, ఏప్రిల్,
1993 |
-
|
శ్రీ.సి.రామ
స్వామి,ఐపిఎస్ |
30, జూన్,
1996 |
-
|
శ్రీ
ఆర్.పి.సింగ్,
ఐపిఎస్ |
30 జూన్ 1997
మరల
13 ఆక్టోబర్
2003 |
-
|
శ్రీ
ఎస్.ఆర్.సుకుమార,
ఐపిఎస్ |
12
సెప్టెంబర్
1998 |
-
|
శ్రీ.పి.రాములు,
ఐపిఎస్ |
15, డిసెంబర్
2000 |
-
|
శ్రీ.ఎమ్.వి.
క్రిష్ణా
రావు, ఐపిఎస్ |
25 ఫిబ్రవరి
2002 |
-
|
శ్రీ.వి.దినేష్
రెడ్డి,
ఐపిఎస్ |
1, డిసెంబర్,
2004 |
-
|
శ్రీ
ఎ.కె.మహంతి,
ఐపిఎస్ |
30,
సెప్టెంబర్
2005 |
-
|
శ్రీ.బల్వీందర్
సింగ్,
ఐపిఎస్ |
12 జనవరి
2007 |
-
|
శ్రీ
బి.ప్రసాద
రావు, ఐపిఎస్ |
21, జనవరి
2008 |
|
|
top |
|
Want to Share your views
with us ? Click here |
|
|
|
|